CTR: కాణిపాకంలో ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈ క్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో తెలిపారు.