KDP: రబీ సీజన్ వేరుశనగ పంటలో అధిక దిగుబడులు సాధించడానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి ఓబులేసు సూచించారు. బుధవారం వేముల మండలం రాచకుంటపల్లిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు విత్తన శుద్ధి, విత్తన మోతాదు,సస్యరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని ఆయన తెలిపారు.