KMM: TSUTF ఖమ్మం జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం ఈ నెల 30న కల్లూరులో జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్, కార్యదర్శి షేక్ నాగూర్ వలి పిలుపునిచ్చారు. మధిరలో జరిగిన ఈ సమావేశంలో విద్యారంగ సమీక్ష, సంఘ నివేదికలు ప్రధాన ఎజెండాగా ఉంటాయని తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యులు తప్పక హాజరు కావాలన్నారు.