HYD: నగరంలో సైబర్ నేరాలలో “మనీ మీల్స్” పాత్ర స్పష్టంగా బయట పడుతోంది. తెలియకుండానే తమ బ్యాంక్ ఖాతాలను తాత్కాలిక లావాదేవీలకు ఇచ్చే వ్యక్తులను నేరగాళ్లు పావులుగా ఉపయోగిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ డబ్బు బదిలీలు జరిగి, నిజమైన నేరస్థుల ఆనవాళ్లు మాయం అవుతున్నాయి. ఇటువంటి వాటిలో పాల్గొనడం కూడా శిక్షార్హమేనని సైబర్ క్రైమ్ శాఖ హెచ్చరించింది.