VZM: ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు మెరకముడిదాం శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్ బుచ్చినాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన, వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.