అయోధ్య బాలరాముడి దర్శనం రెండురోజుల పాటు రద్దు చేశారు. నవంబర్ 24న సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు రామ్‌లల్లా దర్శనం ఉండదని అధికారులు ప్రకటించారు. నవంబర్ 26న ఉదయం 7 గంటలకు దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. నవంబర్ 25న రామ మందిరానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో దర్శనానికి బ్రేక్ వేశామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.