ప్రముఖ నటుడు త్రినాథ్ కటారి స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘ఇట్లు మీ ఎదవ’. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్‌లైన్. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీలో సాహితీ అవంచ కథానాయికగా నటించగా.. ఆర్.పి పట్నాయక్ మ్యూజిక్ అందించాడు.