ASF: బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని MCPIU నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో AOకు వినతిపత్రం అందజేశారు. దరఖాస్తుతో పాటు కుల ఆలయ దృవీకరణ పత్రాలు అడగడంతో నిరుపేదలు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కాబట్టి గడువు పొడిగించాలన్నారు.