SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్మదీక్ష గురువారం నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా చైర్మన్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు సాధించేవరకు తమ ఆందోళన సాగుతుందని చెప్పారు.