TG: నాగర్ కర్నూల్ జిల్లా బొందలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. గృహప్రవేశం సందర్భంగా ఓ వ్యక్తి దావత్ ఇవ్వగా.. ఇంటి పక్కనే ఉన్న పోలేముని లక్ష్మయ్య కూడా వచ్చాడు. ఈ క్రమంలో మద్యంతో పాటు మటన్ తింటుండగా.. గొంతులో బొక్క ఇరుక్కుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు.