ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామ సచివాలయం ప్రతిరోజు 11 తర్వాత మాత్రమే తలుపులు తీస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. తెరిచినప్పటికీ ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే సచివాలయంలో కనిపిస్తున్నారు. సిబ్బంది ఎప్పుడు వస్తారోనని గ్రామస్తులు సచివాలయం బయట పడిగాపులు కాస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇదంతా జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.