ADB: పట్టణంలో ఓ యువకుడు ఉరి వేసుకొని సుసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. బొక్కలగూడ కాలనీకి చెందిన మొహమ్మద్ మైసన్ చౌష్ ఫ్రిడ్జ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతడు గురువారం ఉదయం ఈద్గా గోడ వెనుక ఉన్న చెట్టుకు ఉరేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.