WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాల్సిందిగా సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.