BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో రూ.45 లక్షల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను జేఈ శ్రీనివాసరావు అధికారులుతో కలిసి సందర్శించారు. అనంతరం సిబ్బందితో కలిసి రోడ్డు నాణ్యతను పరిశీలించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యతను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.