AP: ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా రుషికొండ బీచ్లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి లోకేష్ ఇవాళ భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. ఈ సదస్సుతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద రాబోతోందన్నారు.