నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిన్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. అలాగే ఇవాళ రెండవ రోజు క్లాక్ టవర్ వద్ద ఉన్నమంత్రి క్యాంప్ ఆఫీస్లో వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి దోహదపడతానని మంత్రి హామీ ఇచ్చారు.