KMM: ముదిగొండ మండలం గంధసిరిలో గల కాకతీయుల కాలం నాటి శ్రీ సుందర మౌలేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో ఆలయ పునఃనిర్మాణ పనులు చేపట్టనున్నట్లు భట్టి తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.