ADB: అతివృష్టితో రైతులు ఇప్పటికే బేజారయ్యారు. దీనికి తోడు గులాబీ పురుగు బెడద రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బోథ్ మండలంలో పలు చేలలో ప్రత్తికాయలలో ఈ పురుగు దర్శణమిస్తూ రైతులను కలవరపాటుకు గురిచేస్తుంది. గులాబీ పురుగు ఉంటే పత్తి పంటను తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ఈ పురుగు నివారణకు మార్గాలు కనుగొనాలని రైతులు కోరుతున్నారు.