KMM: రఘునాథపాలెం మండలం రజబ్ అలీ నగర్లో పలు వ్యవసాయ పొలాలను ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఏ పంట వేస్తున్నది, గతంలో ఎంత దిగుబడి వచ్చింది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. పామాయిల్ సాగు చేయాలని రైతులకు సూచించారు. పత్తి, మొక్కజొన్న సాగుకు బదులు పామాయిల్ సాగుతో రైతులకు లాభాలు వస్తాయని అన్నారు.