కడప: సింహాద్రిపురం మండలం గురిజాల గ్రామ సమీపాన ఉన్న అతి పురాతన కోనేరు శిథిలావస్థకు చేరడంతో, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో శనివారం నూతన కోనేరు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. నూతన కోనేరు నిర్మాణంతో ప్రజలు, ఎంపీ అవినాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేస్తున్నారు.