ADB: ఆదివాసీల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని గ్రామ పటేల్ మడావి నరాంజి పటేల్ అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ‘చలో ఉట్నూర్’ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీన ఉట్నూర్ మండల కేంద్రంలో జరిగే ఆదివాసీ బహిరంగ సభకు ప్రతిఒక్కరు హాజరుకావాలని కోరారు.