NDL: శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధ రామ పండితారాధ్య స్వామీజీ ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం జగద్గురు పీఠానికి దేవస్థానం తరఫున భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం స్వామీజీ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు.