పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ జంపాల కుమారస్వామి సుల్తానాబాద్ 108 ఆఫీసులో అంబులెన్స్‌ను ఈరోజు తనిఖీ చేశారు. మెడికల్ పరికరాల పనితీరును, ఆక్సిజన్, మానిటర్ వంటి సామగ్రి సక్రమంగా ఉన్నాయా అని పరిశీలించారు. అత్యవసర కాలంలో వెంటనే స్పందించాలని, పేషెంట్ల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో EMT రవివర్మ, పైలట్ సంపత్ పాల్గొన్నారు.