కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు. గురువారం అవనిగడ్డలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, అధికారులు పాల్గొన్నారు.