NLG: కనగల్ గ్రామానికి చెందిన రైతు నక్కల శంకరయ్య (50) ఈరోజు తెల్లవారుజామున కాలువలో జారిపడి మృతి చెందాడు. ఉదయం 4 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్తూ ఈ దుర్ఘటన జరిగింది. శంకరయ్యకు మూర్ఛ వ్యాధి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.