RR: ఫరూఖ్ నగర్ మండలం హాజిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన రూ. 3.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు.