హీరో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ‘కాంత’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రానా సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ‘మాయాబజార్’, ‘పాతాళ భైరవి’ మూవీల చిత్రీకరణకు ఉపయోగించిన మిచెల్ కెమెరానే మళ్లీ వినియోగించామని చెప్పాడు. పాత కెమెరాలను వాడాల్సిన అవసరం ఉండటంతో దాన్ని వాడినట్లు తెలిపాడు.