HYD: నాగచైతన్య-సమంత వివాదంపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటుడు నాగార్జున వేసిన పిటిషన్పై ఇవాళ నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తవగా నాగార్జున, మంత్రి కొండా సురేఖ పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. సాక్షుల స్టేట్ మెంట్లు కూడా రికార్డ్ అయిన ఈ కేసు విచారణకు రానుంది.