SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతగా పని చేయాలి అని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ మండల అధ్యక్షులు, కన్వీనర్లు, యూనిట్ ఇంఛార్జ్‌ల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రవికుమార్ హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.