ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరులో కలెక్టర్ రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఇవాళ పర్యటించారు. ఇటీవల గ్రామంలోని కలుషిత బోరు నీరు తాగి కొందరు విద్యార్థులకు కామెర్లు సోకిన నేపథ్యంలో కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో సురక్షిత మంచినీరు సరఫరాపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా అధికారులు సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.