ELR: కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామ సమీపంలో గురువారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. రహదారి అద్వానంగా మారడంతో నిత్యం వాహన రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అలాగే దుమ్ము లేచి పోవడంతో నిత్యం అనారోగ్య బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.