HYD: గ్రేటర్ పరిధిలో గడువు ముగిసిన వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న వాహనాల్లో సుమారు 8% ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనట్లు అధికారుల అంచనా. ఇటువంటి వాహనాలు రోడ్డు భద్రతకు ప్రమాదకరమని, కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయని ట్రాఫిక్, ఆర్టీఏ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడపకుండా చర్యలు చేపడుతున్నారు.