E.G: తుని పట్టణ పోలీసులు మరోసారి అక్రమ పశు రవాణాపై దాడి చేసి పెద్ద ఎత్తున పశువులను రక్షించారు. ముందస్తు సమాచారంతో కంటైనర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో నిండి ఉన్న పశువులను సూళ్లూరుపేటకు అక్రమంగా తరలిస్తున్నట్టు బయటపడింది. తుని టౌన్ పోలీసు వాహనాన్ని సీజ్ చేసి కేసునమోదు చేశారు. పశువులను సమీప గోశాలకు పంపించారు.