AP: విశాఖ భారత్లోనే క్లీన్ అండ్ సేఫ్ సిటీ అని సీఎం చంద్రబాబు అన్నారు. CII ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. విశాఖ పెట్టుబడులకు అనువైన ప్రాంతం. అన్నిరకాల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. పెట్టుబడులకు ఇన్ఫ్రా సిద్ధంగా ఉంది. రెండు దశాబ్దాల క్రితమే పవర్ రిఫామ్స్ తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు.