VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి సబ్బవరం వెళ్లే రోడ్డులో వర్షంకాలంలో మురుగునీరు రోడ్డు మీద ప్రవహించడంతో స్థానిక 12వ,వార్డు మెంబర్ కారుమూరి సాయిలక్షి సమస్యను సర్పంచ్ రామస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే ఆయన స్పందించి పారిశుధ్య సిబ్బందితో వార్డు కాలువలలో పేరుకుపోయిన పూడికలను తీశారు. పూడికలు తీయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.