KRNL: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే ఆయన భార్య రామాంజినమ్మతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.