VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.శిరీష మాట్లాడుతూ.. 29 రోజులకు గాను చదురుగుడి హుండీల నుంచి రూ .20,97,852/-ల నగదు, 15 గ్రాముల 200 మిల్లీగ్రా ముల బంగారం, 260 గ్రాముల వెండి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.