లావు తగ్గడానికి కొంతమంది తక్కువగా తింటూ ఆకలితో కడుపు మాడ్చుకుంటారు. కానీ, ఇలా చేస్తే ఫలితం ఉండదు. తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. చిరుతిళ్లను ఇష్టంగా తింటూ ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని భుజించరు. ఇది సరైన పద్ధతి కాదు. సరైన ఆహారాన్ని తీసుకుంటే, శరీరంలో కొవ్వును కరిగిండం సులువవుతుంది.