BHNG: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం బొర్రాల్లగూడెం స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆటో జాతీయ రహదారి దాటుతున్న వృద్ధురాలిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.