NDL: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో సినీ నటుడు నితిన్ దంపతులు నిన్న ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వారికి అధికారులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. మరో సినీ నటుడు శ్రీకాంత్ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.