సిరిసిల్ల కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ కొనసాగుతోంది. కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చే అవకాశం ఉన్న కేసులను ఈ సందర్భంగా విచారిస్తున్నారు. ఓ ప్రమాద ఘటనకు సంబంధించి బోయినపల్లి మండల వాసికి రూ.2,20,000 అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి పుష్పలత, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్, డీఎల్ఎస్ఎ సెక్రటరీ లక్ష్మణచారి, లోక్ అదాలత్ సభ్యుడు పాల్గొన్నారు.