HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆ పరిధిలోని మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.