VZM: ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దళారీలను, మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరించారు. రైతులు పత్తిని ప్రభుత్వ కనీసమద్దతు ధర రూ.8,110 కంటే తక్కువకు విక్రయించవద్దని, ఇప్పటికే పత్తి సాగు ఉన్న 140 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.