TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే లెక్కింపు జరగనుండటంతో మధ్యాహ్నం 1 గంటలోపు ఉప ఎన్నిక ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగా హోం ఓటింగ్ ఓట్లను, తర్వాత షేక్‌పేట డివిజన్, చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నట్లు తెలుస్తోంది.