BPT: బల్లికురవ, కొత్తపాలెం గ్రామాల పరిధిలో నూతన విద్యుత్తు లైన్ల ఏర్పాటులో భాగంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఇన్ఛార్జ్ AE సుబ్బారావు తెలిపారు. రెండు గ్రామాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి తమకు సహకరించాలని కోరారు.