నెల్లూరు లేడీ డాన్ నిడికుంట అరుణను కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 13, 14 తేదీల్లో విచారించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం 15న ఉదయం నెల్లూరు కేంద్ర కారాగారంలో అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.