శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయ ఈ భవనం పూర్తిగా పాడయింది. స్లాబ్ పెచ్చులు ఊడి, గోడలు పాడయ్యాయి. చినుకు పడితే కారిపోతుంది. ప్రభుత్వ కార్యాలయం నిర్వహణ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. భవనానికి మరమ్మతులు నిర్వహించాలని సిబ్బంది కోరుతున్నారు. జిల్లాస్థాయి కార్యాలయంపై నిర్లక్ష్యం తగదని అంటున్నారు.