VSP: తైవాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పూర్తి సహకారం అందిస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని సీఎం అన్నారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా గురువారం విశాఖలో భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు.