SKLM: పలాస పట్టణంలో ఈనెల 6వ తేదీన వైశ్యరాజు లక్ష్మినారాయణరాజును కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆముదాలవలస పట్టణానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఈ కిడ్నాప్ వ్యవహారంలో పాల్గొన్నారని, ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా, పరారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.