KMR: ఎల్లారెడ్డి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు శివాలయాన్ని దర్శించుకుని స్వామివారి దీవెనలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆలయానికి సీసీ రోడ్లు నిర్మాణం అవసరం ఉందని విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్యే మదన్ సానుకూలంగా స్పందించి నిర్మాణానికి అవసరమా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.